ఒకప్పటి మైనింగ్ కింగ్, బళ్ళారి ప్రాంతానికి చెందిన రాజకీయవేత్త గాలి జనార్ధన్ రెడ్డి మరోసారి చిక్కుల్లో పడ్డారు. అంబిడెంట్ స్కామ్ లో ఆయన్ను కర్ణాటక సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. 18 కోట్ల రూపాయల లంచం ఇవ్వచూపారనే కేసులో ఆయన్ను సుదీర్ఘ విచారణ అనంతరం పోలీసులు అదుపులోకి తీసుకుని..కోర్టులో హాజరుపర్చగా..ఆయనకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
ఐపీసీ 120బి, 201 సెక్షన్ల కింద గాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించటంతో పాటు..సాక్ష్యాల విషయంలో గాలి జనార్ధన్ రెడ్డి చేసిన ప్రయత్నాలపై ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.