భారత్ లో తొలి హైపర్ లూప్ ప్రాజెక్టు

Update: 2018-11-08 04:38 GMT

దేశంలో తొలి హైపర్ లూప్ ప్రాజెక్టుకు రంగం సిద్ధం అయింది. పూణే-ముంబయ్ మధ్య ఏర్పాటు అయ్యే ఈ ప్రాజెక్టుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు అమల్లోకి వస్తే ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం 25 నిమిషాలకు తగ్గనుంది. ప్రస్తుతం రోడ్డు మార్గం ద్వారా అయితే ఈ ప్రయాణం పది గంటలపైనే ఉంది. స్విస్ ఛాలెంజ్ మోడల్ లో ఈ ప్రాజెక్టు అమలు చేయనుంది. ఇప్పటికే విర్జిన్ హైపర్ లూప్ సంస్థ ఇఛ్చిన ప్రతిపాదన ను ఛాలెంజ్ చేస్తూ అంతర్జాతీయంగా సంస్థలను ఆహ్వానించనుంది మహారాష్ట్ర ప్రభుత్వం. 2019 సంవత్సరంలో వర్జిన్ హైపర్ లూప్ 15 కిలోమీటర్ల మేర టెస్ట్ రూట్ ను నిర్మించాలనే యోచనలో ఉంది.

Similar News