‘ ఏ మొహం పెట్టుకుని వస్తారు. ఏమి చేశారని. ఇంకా బతికున్నామా లేదా? అనా? .గాయం చేశాం. కారం చల్లిపోవాలి అని వస్తున్నారా?.మీ వల్ల కదా మేం కష్టాల్లో ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి సహకరించే వాళ్ళను ఏమనాలి. రాష్ట్ర ద్రోహులు కాదా వీళ్ళందరూ. రాష్ట్రానికి ఇంత ద్రోహం చేసి మళ్లా తగదునమ్మా అని ఇక్కడకు వచ్చి ఎక్కిరిస్తారా?.మా బతుకేదో మేం బతుకుతున్నాం. కష్టపడుతున్నాం. మీరు రావటం ఏంటి. వీళ్ళు సహకరించటం ఏంటి?.మీటింగ్ లకు పోవటం ఏంటి?.అందుకే నేను ఒకటి చెబుతున్నా. కాంగ్రెస్ పార్టీని శాశ్వతంగా బాయ్ కాట్ చేయాలి. అప్పటికి కూడా మనకు కసితీరదు.కానీ వాళ్ళతో పెట్టుకుంటే మన సమయం వేస్ట్ అవుతుంది కాబట్టి అభివృద్ధి వైపు పోవాలి. వాళ్ళను ఇగ్నోర్ చేయాలి. ఛీకొట్టాలి ’.ఇవీ రాష్ట్ర పర్యటనకు రాహుల్ గాంధీ వచ్చిన సమయంలో ఏ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు. ఛీ కొట్టాలి..శాశ్వతంగా బాయ్ కాట్ చేయాలి అని పిలుపునిచ్చిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ‘వీణ’తో మీటారు.
సహజంగా విఐపిలు రాష్ట్రానికి వచ్చినప్పుడు వాళ్లకు జ్ణాపిక ఇవ్వటం ఆనవాయితీ. అలాంటిది చంద్రబాబు తాను ఎవరిని కలవటానికి వెళ్ళారో వాళ్లకు శాలువా కప్పి..జ్ణాపికను అందజేశారు. కేంద్రంలో బిజెపియేతర వ్యతిరేక కూటమిపై చర్చించేందుకు అంటూ గురువారం నాడు చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ టీమ్ ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీతో భేటీ అయింది. గుజరాత్ అల్లర్ల సమయంలో భవిష్యత్ లో బిజెపితో పొత్తు ఉండబోదని ప్రకటించిన తరహాలోనే..ఇప్పుడు కాంగ్రెస్ ను శాశ్వతంగా బాయ్ కాట్ చేయాలి..ఛీ కొట్టాలి అని పిలుపునిచ్చిన వాళ్లతోనే కలసి రాజకీయాలు చేయటానికి చంద్రబాబు రెడీ అయిపోయారు. భవిష్యత్ లో దేశాన్ని కాంగ్రెస్ పార్టీనే రక్షించగలదు అని చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.