వైసీపీలో చేరిన సీ. రామచంద్రయ్య

Update: 2018-11-13 07:53 GMT

తాజాగా కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన సీనియర్ నేత సి. రామచంద్రయ్య మంగళవారం నాడు వైసీపీలో చేరారు. టీడీపీ, కాంగ్రెస్ పొత్తును వ్యతిరేకిస్తూ ఆయన పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. విజయనగరం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. రామచం‍ద్రయ్యకు కండువా కప్పిన వైఎస్‌ జగన్‌ ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. రామచంద్రయ్యతో పాటు కడప జిల్లాకు చెందిన రైల్వేకోడూరు నియోజకవర్గం టీడీపీ నాయకులు ఎన్‌ సుబ్బరాఘవరాజు కూడా వైఎస్సార్‌ సీపీలో చేరారు. రామచంద్రయ్య చేరికతో వైఎస్సార్‌ జిల్లాలో వైఎస్సార్‌ సీపీ మరింత బలపడుతుందని పార్టీ నేతలు చెబుతున్నారు.

అనంతరం రామచంద్రయ్య మీడియాతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయుడు పెంచి పోషిస్తున్న అరాచక శక్తులను అంతమొందిచాల్సిన అవవసరం ఉందన్నారు. ఈ అక్రమాలను అరికట్టే శక్తి వైఎస్‌ జగన్‌కు మాత్రమే ఉందని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు ఖూని చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడని విమర్శించారు. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే చంద్రబాబు నాయుడిని దూరం పెట్టాలని పిలుపునిచ్చారు. ఏ భావాలతో టీడీపీ పుట్టిందో అది ఇప్పుడు లేదని వ్యాఖ్యానించారు.

 

Similar News