కాంగ్రెస్ కు షాక్..జనసేనలోకి నాదెండ్ల మనోహర్

Update: 2018-10-11 08:06 GMT

ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అసలే ఏపీలో అంతంత మాత్రంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇది ఊహించని షాక్ లాంటిదే. గత కొంత కాలంగా ఆయన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న దాఖలాలు లేవు. నాదెండ్ల మనోహర్ శుక్రవారం నాడు జనసేనలో చేరుతున్నట్లు అధికారిక ప్రకటన చేసే అవకావం ఉందని జనసేన వర్గాలు తెలిపాయి.

గురువారం రాత్రి నాదెండ్ల మనోహర్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరూ తిరుమలలో భేటీ కానున్నారు. వీరిద్దరూ శుక్రవారం ఉదయం స్వామివారిని దర్శించుకోనున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో మనోహర్ కు ఎప్పటి నుంచో సత్సంబంధాలు ఉన్నాయి. పలుమార్లు వీరిద్దరి భేటీ కూడా జరిగింది. సీనియర్ నేతగా ఉన్న నాదెండ్ల మనోహర్ జనసేనలో చేరటం ఆ పార్టీకి కొత్త జోష్ ఇస్తుందని జనసేన వర్గాలు భావిస్తున్నాయి.

 

 

Similar News