తుఫాన్లకు కూడా అడ్వర్టైజ్ మెంట్లా?..ఏపీలో కొత్త ట్రెండ్!

Update: 2018-10-16 04:21 GMT

తుఫాన్లకు కూడా ప్రభుత్వం ప్రకటనలు ఇస్తుందా? అందులో కూడా ప్రచారం చేసుకుంటారా?. ఏపీలో ఇది కొత్త ట్రెండ్ లా ఉంది. ఎందుకంటే ఏపీ ప్రభుత్వం మంగళవారం నాడు కొన్ని పత్రికల్లో ప్రకటనలు ఇచ్చింది?. అందులో చంద్రబాబు బస్సులో నుంచి బాధితులనుద్దేశించి మాట్లాడుతున్న ఫోటోను ప్రముఖంగా ప్రచురించారు. అందులోనే తుఫాను బాధితులకు అందచేస్తున్న సాయం వివరాలు ఉన్నాయి. ‘తిత్లీ తుఫాన్ బాధితులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొండంత అండ’ అంటూ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అదే సమయంలో తుఫాను బాధితులను ఆదుకోవటానికి సీఎం సహాయ నిధికి సాయం చేయాల్సిందిగా ప్రకటనలో పేర్కొన్నారు. సీఎం పిలుపు ఇవ్వకముందే టాలీవుడ్ కు చెందిన పలువురు హీరోలు తమ వంతు సాయం ప్రకటించారు. తిత్లీ తుఫాన్ శ్రీకాకుళం జిల్లాను అతలాకుతలం చేసిన మాట వాస్తవమే. అక్కడి ప్రజలకు వచ్చిన కష్టం వెంటనే తీరేది కూడా కాదు. ఇంకా పలు చోట్ల విద్యుత్ సరఫరానే పునరుద్ధించలేదు.

సాయం కోసం కూడా చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో తుఫాన్లను కూడా ప్రచారం కోసం వాడుకోవాలా?. సీఎం సహాయ నిధికి సాయం కోరాలంటే ప్రత్రికా ప్రకటన విడుదల చేస్తే చాలు..ఆ విషయాలను ప్రముఖంగా వస్తాయి. ఇప్పుడు ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి వాటి ద్వారా సీఎంవో పేరుతో ట్వీట్లు పెట్టొచ్చు. కానీ ఈ తరుణంలో అవన్నీ వదిలేసి తుఫాను ను కూడా ప్రచారానికి వాడుకోవటం ఏమిటని అధికార వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఇది ఐఅండ్ పిఆర్ శాఖ అధికారులు అత్సుత్యాహమా?లేక ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే ఇలా చేశారా?. ఏదైనా తుఫాన్ యాడ్ మాత్రం అధికార వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.

 

 

 

 

 

 

Similar News