అధికార తెలుగుదేశం పార్టీకి ఝలక్. తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి అత్యంత సన్నిహితుడు, టీటీడీ మాజీ ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి టీడీపీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఆయన త్వరలోనే పవన్ కళ్యాణ్ కు చెందిన జనసేన పార్టీలో చేరనున్నారు. చదలవాడ గురువారం నాడు హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. దసరా సమయంలో ఆయన పార్టీలో చేరే అవకాశం ఉందని సమాచారం.
చదలవాడ కృష్ణమూర్తి చేరికకు పవన్ కళ్యాణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. రాబోయే రోజుల్లో అధికార టీడీపీ నుంచి మరిన్ని చేరికలు ఉంటాయని జనసేన వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి ఏపీ ఎన్నికలు హాట్ హాట్ గా జరగటం ఖాయంగా కన్పిస్తోంది. ప్రభుత్వంలోని ఇద్దరు మంత్రులు కూడా ఎన్నికల నాటికి జనసేనలోకి జంప్ చేయటానికి ఇప్పటికే రంగం సిద్దం చేసుకుని ఉన్నారు.