ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల తొలి రోజు ఏపీ బిజెపి వెరైటీ నిరసన తెలిపింది. చదరపు అడుగుకు పది వేల రూపాయలు ఖర్చు పెట్టి తాత్కాలిక అసెంబ్లీ, సచివాలయం కట్టినా..చిన్న పాటి వర్షానికి నీళ్లు కారుతున్నాయి. అందుకే ముందు జాగ్రత్తగా గొడుగులు తెచ్చుకున్నాం అని బిజెపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రకటించారు. ఈ నిరసనలో బిజెపి ఎమ్మెల్యే, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ పాల్గొనకపోవటం విశేషం.
సీఎం చంద్రబాబుకు కోపం వచ్చే పనులు ఆయన ఏమీ చేయరనుకోండి? ఒక్క గొడుగులే కాదు..రెయిన్ కోట్స్ తో సహా వీరంతా అసెంబ్లీ ప్రాంగణంలో హడావుడి చేశారు. ఈ సమయంలోననే బిజెపి ఎమ్మెల్యేలు సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ ప్రభుత్వం తీవ్ర అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు.