ఉఫాది కల్పన..పెట్టుబడుల సాధన విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ లు అలవోకగా దొంగ లెక్కలు చెప్పేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డు (ఏపీఈడీబీ) జూలై సంచిక ప్రకారం ఎంవోయులు వాస్తవరూపం దాల్చిన రేటు 30 నుంచి 40 శాతం మధ్య ఉందని తన తాజా నివేదికలో పేర్కొంది. కానీ ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ మాత్రం అలవోకగా అబద్దాలు చెప్పేస్తున్నారు. ఆయన తాజాగా ట్విట్టర్ లో పెట్టిన కామెంట్ ఇది. ‘పారిశ్రామిక ఒప్పందాలను వాస్తవ రూపంలోకి తేవడంలో దేశంలోనే ఏపీ అగ్రభాగాన ఉంది. ఏపీలో ఎంఓయూ కన్వర్షన్ 48-53 శాతం మధ్యలో ఉందంటే లక్ష్యాలను సాధించడంలో ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో కృషి చేస్తోందో అర్థం చేసుకోవచ్చు.’. అని పేర్కొన్నారు. ఈ లెక్కన నారా లోకేష్ చెప్పింది అబద్దమా? ఏపీఈడీబీ చెప్పింది తప్పా?. అబద్దం అయినా అందరూ ఒకటే చెపితే బాగుంటదేమో లోకేష్ ఆలోచించుకోవాలి. వాస్తవంగా మాట్లాడుకోవాలంటే ఈడీబీ లెక్కలు కూడా కరెక్ట్ కాదనే అదికార వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే భాగస్వామ్య సదస్సుల సందర్భంగా జరిగిన ఒప్పందాల్లో చాలా వరకూ జెండా ఎత్తేశాయి.
గొప్పల కోసం భారీ ఎత్తున సంఖ్య పెంచుకునేందుకే ఈ లెక్కలు చెప్పారు. ఉదాహరణకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి అత్యంత సన్నిహితుడు అయిన అనిల్ అంబానీ ఐదు వేల కోట్ల రూపాయలతో విశాఖపట్నంలో పెట్టదలచిన నావల్ బేస్డ్ యూనిట్ ఏ మాత్రం ముందుకు సాగే అవకాశం లేదు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉంటున్న ఎల్ ఈపీఎల్ గ్రూపు ఏపీ సర్కారుతొ పలు పరిశ్రమలు, పర్యాటక ప్రాజెక్టులకు సంబంధించి ఎంవోయులు అయితే చేసుకుంది. ఈ ఎంవోయుల విలువ ఏకంగా 14 వేల కోట్ల రూపాయలు. ఇలాంటి జాబితానే ఓ పెద్ద చాంతాడు అంత ఉంది. అంతే కాదు..ప్రతిసారి విదేశీ పర్యటనలకు వెళ్లి కలసిన కంపెనీలను కలసి పోటోలు దిగి రావటం తప్ప చంద్రబాబు అండ్ టీమ్ చేస్తున్నది ఏమీలేదు. కానీ లెక్కలు మాత్రం కోటలు దాటేలా చెబుతున్నారు. ఎంవోయుల అమలు మాత్రం చాలా వరకూ అడుగు ముందుకు పడటం లేదు. ప్రపంచంలోనే అతి పెద్ద రిఫైనరీ అయిన సౌదీ అరామ్ కో ఏపీలో వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుందని ఊదరగొట్టారు. తీరా చూస్తే ఆ సంస్థ మహారాష్ట్రకు వెళ్లిపోయిది.