సీఎం శాఖలో అక్రమాలు..మంత్రి ఆదేశాలు

Update: 2018-07-07 07:13 GMT

అది ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పర్యవేక్షణలో ఉన్న శాఖ. అందులో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. ఆ విషయాన్ని ఓ మంత్రి గుర్తించారు. అంతే కాదు..సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి..అక్రమాలను ఆపాలని ఆదేశాలు జారీ చేశారంట. ఇదీ ఆ వార్త సారాంశం. బిజెపికి చెందిన మంత్రి కామినేని శ్రీనివాస్ తన మంత్రి పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి ఏపీలో వైద్య, ఆరోగ్య శాఖను ముఖ్యమంత్రి చంద్రబాబు తన వద్దే పెట్టుకున్నారు. మాణిక్యాలరావుకు చెందిన దేవాదాయ శాఖను మాత్రం ఉప ముఖ్యమంత్రి కె ఈ కృష్ణమూర్తికి కేటాయించారు. వైద్య ఆరోగ్య శాఖ అత్యంత కీలకమైనది కావటంతో సీఎం చంద్రబాబే దీన్ని తన వద్ద అట్టిపెట్టుకున్నారు. కానీ శనివారం వచ్చిన వార్త ప్రభుత్వ వర్గాల్లో కలకలం రేపింది. అదేంటి అంటే...‘ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ కౌన్సెలింగ్ ను వెంటనే నిలిపివేయాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశం - వైద్య విద్యలో అవకతవకలు, బీసీ విద్యార్థులకు జరుగుతున్న అన్యాయంపై వీసీతో మాట్లాడిన మంత్రి అచ్చెన్నాయుడు’. ఇదీ అసలు కథ.

అంటే సీఎం వైద్య, విద్యా శాఖను తన వద్దే పెట్టుకున్నారు కానీ..ఏమీ పట్టించుకోవటం లేదన్న మాట. సాక్ష్యాత్తూ ఓ మంత్రి సీఎంకు చెందిన శాఖలో అక్రమాలను ప్రస్తావించి..వాటిని సరిదిద్దాలని కోరటం ఎంత సిగ్గుచేటు వ్యవహారం. అంటే చంద్రబాబునాయుడు డబ్బులు వచ్చే పనులు తప్ప..ఇతర అంశాలు ఏమీ పట్టించుకోవటం లేదని ఈ ఘటన ద్వారా మరోసారి నిరూపించుకున్నట్లేనా?. కొద్ది రోజుల క్రితమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సత్వరమే వైద్య శాఖ మంత్రిని ప్రకటించాలని..లేదంటే దీక్ష చేస్తానని హెచ్చరించారు. అయితే నాకేంటి అన్న తరహాలో చంద్రబాబు ఈ డిమాండ్ ను ఏ మాత్రం పట్టించుకోలేదు. పట్టించుకోకపోతే పట్టించుకోకపోయారు?. అందులో అన్నీ సవ్యంగా సాగేలా చూడాల్సిన బాధ్యత సీఎంపై ఉంది కదా?. కానీ అదేమీ చూడటం లేదు. సీఎం శాఖలో అవకతవకలపై మంత్రి అభ్యంతరాలు వ్యక్తం చేయటమే హైలెట్.

 

Similar News