జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ కార్లను మార్చినట్లు భార్యలను మారుస్తారని అన్నారు. నాలుగేళ్ళు..ఐదేళ్లకు ఓ సారి భార్యను మారుస్తాడని తీవ్ర విమర్శలు చేశారు. ఇలాంటి వ్యక్తులు చేసే వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలా? అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ గురించి కూడా మాట్లాడుకోవాల్సి రావటం, ఆయన రాజకీయాలపై మాట్లాడటం, వినటం ఓ ఖర్మ అని వ్యాఖ్యానించారు. అసలు పవన్ కళ్యాణ్ కు విలువలు ఎక్కడ ఉన్నాయని జగన్ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ లా ఇలా బహుభార్యాత్వం ఎవరికైనా ఉంటే వారిని జైల్లో వేసేవారన్నారు.
అలాంటి వ్యక్తి నైతికత.. నిజాయితీ గురించి మాట్లాడుతున్నారని జగన్ ఎద్దేవా చేశారు. చంద్రబాబును కాపాడాలనుకునే ప్రతీసారి పవన్ బైటకొచ్చి ఓ ట్వీటో.. ఓ ప్రెస్‌మీట్ పెడతారని, ఆ తర్వాత మళ్లీ ఎక్కడికి వెళ్లిపోతారో తెలియదని వ్యంగాస్త్రాలు సంధించారు. ఏపీ ప్రజలకు అన్యాయం చేసిన వ్యక్తి పవన్ అంటూ దుయ్యబట్టారు. నాలుగేళ్ళ పాటు టీడీపీ - బీజేపిలతో కలిసి కాపురం చేసి, ఏపీ ప్రజలకు అన్యాయం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని ఆరోపించారు.