అంతా..నేనూ..నాన్నే!

Update: 2018-07-19 05:20 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏమి జరిగినా అంతా ‘నేనూ...నాన్నే’ అని ఏపీ మంత్రి, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చెప్పదలచుకున్నారా?. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్(ఈవోడీబీ) ర్యాంకింగ్ కు..నారా లోకేష్ కు సంబంధం ఏమిటి?. అసలు ఇది పూర్తిగా పరిశ్రమల శాఖకు సంబంధించిన అంశం. అంటే మంత్రులందరినీ డమ్మీలు చేసి...క్రెడిట్ అంతా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ లు తమ ఖాతాలో వేసుకోదలచుకున్నారా?. ఓ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన లోకేష్ ..ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నో సమీక్షా సమావేశాలు పెట్టారని..ఎంతో కృషి చేశారని చెప్పుకొచ్చారు. కానీ పరిశ్రమల శాఖ మంత్రి అమర్ నాధ్ రెడ్డిని పూర్తిగా విస్మరించారు. భాగస్వామ్య ఒప్పందాల చక్కదనం ఏమిటో ఆ జాబితా చూసిన వారికి తెలుస్తుంది. ఏపీ ప్రభుత్వంలో చంద్రబాబు, తాను తప్ప ఎవరూ పనిచేయటంలేదనే ధోరణితో లోకేష్ ఇంటర్వ్యూ సాగింది. ఆ ఇంటర్వ్వూలో లోకేష్ చేసిన వ్యాఖ్యలు చూసిన టీడీపీ నేతలే అవాక్కు అవుతున్నారు. ఒకసారి ఆయన తన ఇంటర్వ్కూను తాను చూసుకుంటే ఏమి మాట్లాడింది కూడా తెలుస్తుందని ఓ నేత వ్యాఖ్యానించారు.

కొద్ది రోజుల క్రితం ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి చినరాజప్పకు కనీస సమాచారం ఇవ్వకుండానే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఓ భవనానికి శంకుస్థాపన చేశారు. ఆ శాఖతో ఏ మాత్రం సంబంధం లేదని మంత్రి నారాయణ దానికి హాజరు అయ్యారు కానీ..శాఖ మంత్రి చినరాజప్పకు మాత్రం సమాచారం కూడా ఇవ్వలేదు అధికారులు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ఈ విషయాన్ని పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. మరో ఉప ముఖ్యమంత్రి కె ఈ కృష్ణమూర్తికి కూడా ఇలాంటి చేదు అనుభవాలు ఎన్నో. పలు శాఖలకు చెందిన మంత్రులను పూర్తిగా విస్మరించి ఆయా శాఖల విషయంలో ‘ఇద్దరు ముఖ్యుల’ జోక్యం విపరీతంగా పెరిగిపోతోందని..వీరి అనుమతి లేకుండా ముందుకు ఏదీ కదలని పరిస్థితి ఉందని చెబుతున్నారు.

 

Similar News