రమణదీక్షితులు కంపెనీ ఎలా పెడతారు?

Update: 2018-06-27 11:11 GMT

టీటీడీ మాజీ ప్రధాన ఆర్చకుడు రమణదీక్షితులు ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకున్నారు. టీటీడీ ఉద్యోగిగా ఉండి..సర్వీసు నిబంధనలు ఉల్లంఘించి ఆయన ఓ కంపెనీని ఏర్పాటు చేశారు. ఇది సర్వీసు రూల్స్ కు విరుద్ధం. ఇదే అంశాన్ని 20 సూత్రాల అమలు కార్యక్రమాల మాజీ ఛైర్మన్ వై. శేషసాయిబాబు ఆధారాలతో సహా మీడియా ముందుకొచ్చారు. అంతే కాదు..దీనికి సంబంధించిన పూర్తి అంశాలతో ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రమణదీక్షితులపై ఫిర్యాదు చేశారు. 2011 లో ఏర్పాటు చేసిన కంపెనీ డాక్యుమెంట్లలో కూడా ఆయన తన వృత్తి టీటీడీ ప్రధాన అర్చకుడిగానే పేర్కొన్నారని...అంతే కాకుండా అడ్రస్ కూడా తిరుమలలోని అధికారిక నివాసం అడ్రస్సే ఇచ్చారని తెలిపారు.

దీనికి సంబంధించిన పత్రాలను కూడా ఆయన మీడియాకు విడుదల చేశారు. డిప్యూటీ ఈవో క్యాడర్ లో ఉన్న రమణదీక్షితులు ఇలా కంపెనీ ఏర్పాటు చేయటం నిబంధనలకు వ్యతిరేకం అని..ఈ అంశాలను పరిశీలించి ఆయనపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. టీటీడీ ప్రధాన అర్చకుడిగా పనిచేసిన ఆయన కోట్లాది భక్తులు కొలిచే వెంకటేశ్వరస్వామి దేవాలయం ప్రతిష్ట దెబ్బతినేలా..రాజకీయ నాయకుడి తరహాలో విమర్శలు చేయటం సరికాదన్నారు.

 

Similar News