‘ఆ డైరీ’లో ఇద్దరు టాప్ హీరోయిన్లు!

Update: 2018-06-21 11:15 GMT
‘ఆ డైరీ’లో ఇద్దరు టాప్ హీరోయిన్లు!
  • whatsapp icon

అమెరికా సెక్స్ రాకెట్ కు సంబంధించి టాలీవుడ్ కు చెందిన ఇద్దరు టాప్ హీరోయిన్ల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. మొదటి నుంచి ఆరుగురు పేర్లు హల్ చల్ చేయగా..కొత్తగా మరికొన్ని పేర్లు ఇందులో చేరాయి. అయితే అమెరికా పర్యటనల సమయంలో వీరి సమ్మతితోనే ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నందున సదరు హీరోయిన్లపై అసలు కేసులు ఉంటాయా?. ఉంటే ఎలాంటి కేసులు నమోదు చేస్తారనే విషయంపై సస్పెన్స్ నెలకొంది. ఎవరైనా బలవంతంగా సెక్స్ రాకెట్ లోకి దింపితే సమస్యలు వస్తాయి తప్ప..డబ్బుల కోసం రహస్యంగా అలా తిగిరేవారిపై కేసులు ఉండే అవకాశం లేదని చెబుతున్నారు. అయితే డైరీలో వీరి పేర్లు..నివాసం ఉన్న హోటళ్ళు...రూమ్ నెంబర్లతో సహా పేర్లు వెలుగులోకి రావటంతో పరిశ్రమ వర్గాల్లో కలకలం నెలకొంది. అయితే అమెరికా దర్యాప్తు అధికారులు విచారణను పూర్తి పారదర్శకంగా ఉంచుతారు.

అయితే అసలు విషయం నిర్ధారణ కాకుండానే పేర్లు బహిర్గతం చేయటం సరికాదనే ఉద్దేశంతో వీళ్ళను ఏ, బీ, సీ, డీలు పేర్కొని..కేసు విచారణ చేస్తున్నారు. విచారణ పూర్తయ్యే సమయానికి ఈ జాబితా మరింత పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి సాగుతున్న ఈ వ్యవహారాలను చూస్తే ఇందులో ఓ ఛానల్ సీఈవో తోపాటు..ఓ టాప్ హీరోకు సన్నిహితంగా ఉండే వ్యక్తి పేరు కూడా ఈ జాబితాలో ఉన్నట్లు సమాచారం. తొలుత వచ్చిన పేర్లలో ముగ్గురు హీరోయిన్లు ఉండగా...తాజాగా వెలుగు చూసిన జాబితాలో ఇద్దరు స్టార్లు..మరో హీరోయిన్ ప్రస్తుతం ఎక్కడా కన్పించటం లేదు. కానీ జాబితాలో మాత్రం ఆమె పేరు ఉంది.

Similar News