జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మళ్ళీ ప్రజల్లోకి వస్తున్నారు. ‘పోరాట యాత్ర’ను తిరిగి ఈ నెల 26 నుంచి పవన్ ప్రారంభించనున్నారు. అదీ ఎక్కడ ఆపారో..అక్కడ నుంచే. వైజాగ్ లోని అన్ని నియోజకవర్గాలను పవన్ తన యాత్ర ద్వారా కవర్ చేయనున్నారు. పవన్ కళ్యాణ్ కు గత కొంత కాలంగా ఉన్న కంటి సమస్యను తొలగించుకునేందుకు శస్త్ర చికిత్స చేయించాలనుకున్నారని..కానీ డాక్టర్లు దీనికి మరికొంత సమయం పడుతుందని తేల్చటంతో మళ్ళీ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు జనసేన తెలిపింది. విశాఖలో పవన్ పర్యటన మూడు నుంచి నాలుగు రోజుల పాటు సాగనుంది. విశాఖ తర్వాత పోరాటయాత్ర తూర్పు గోదావరి జిల్లాలో ఉంటుందని..దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నాయని తెలిపారు.