అమరావతిలో ‘నారా’ రియల్ ఎస్టేట్ డెవలపర్స్

Update: 2018-06-15 08:23 GMT

అమరావతిలో ఆ భూమి రాజధాని కోసం తీసుకున్నది. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రం రాజధానిని పక్కన పెట్టి ప్యూర్ ‘రియల్టర్’ అవతారం ఎత్తారు. ఇఫ్పటికే సింగపూర్ సంస్థలకు 1691 ఎకరాలు ఇచ్చేశారు. ఇప్పుడు ‘రియల్ ఎస్టేట్’ సంస్థలకు భూములు ఇవ్వటానికి రెడీ అయిపోయారు. ఎవరైనా రైతుల దగ్గర నుంచి రాజధాని పేరు చెప్పి భూములు తీసుకుని ఆ భూమిని రియల్ ఎస్టేట్ సంస్థలకు దోచిపెడతారా?. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రం నేను అలాగే చేస్తాను అని చెబుతున్నారు. ఇప్పటికే సీఆర్ డీఏ కు కొంత భూమి ఇచ్చి ఆ భూమిలో అమ్మకానికి అపార్ట్ మెంట్లు కట్టాలని నిర్ణయించారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ డెవలపర్లకు..నిర్మాణ సంస్థలకు భూములు కేటాయించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. రాజధానికి అవసరమైన భూమిని మాత్రమే తీసుకుని ఉంటే అదే భూమిని రైతులు అమ్ముకుని లాభాలు గడించేవారు కదా?. ఆ పని ప్రభుత్వం ఎందుకు చేయాలి?. ప్రభుత్వం ఉద్యోగం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయటమా?. ఇక్కడే ఉంది అసలు మతలబు.

రాజధాని ప్రాంతంలో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందాలి. ప్రజలకు నివాస సముదాయాలు అందుబాటులో ఉండాలి. పూలింగ్ పేరుతో రైతుల దగ్గర నుంచి తీసుకున్న భూమిని బడాబాబులకు ఇచ్చేయాలి. ప్రతిగా వాళ్ల నుంచి వందల కోట్ల రూపాయల ముడుపులు దక్కించుకోవాలి. అదీ చంద్రబాబు ప్లాన్. అచ్చం హైదరాబాద్ లో రహేజా మోడల్ అంటున్నారు చంద్రబాబు. ఇది ఎంత పెద్ద స్కామో అందరికీ తెలిసిందే. అంటే చంద్రబాబు ఓ వైపు సింగపూర్ స్కామ్ ను కొనసాగిస్తూనే..దేశీయ రియల్, ఐటి స్పేస్ డెవలపర్లకు వందలాది ఎకరాలు కేటాయించి మరోసారి భారీ స్కామ్ లకు తెరలేపుతున్నారన్న మాట.

ఓ వైపు ప్రభుత్వమే ఇంత భారీ ఎత్తున రియల్ ఎస్టేట్ సంస్థలకు, అగ్రశ్రేణి నిర్మాణ సంస్థలకు భారీ ఎత్తున భూములు ఇస్తే..రాజధాని కోసం భూములిచ్చిన రైతుల దగ్గర ఉన్న వాణిజ్య స్థలాలకు డిమాండ్ ఎలా పెరుగుతుంది? వారికి మంచి రేటు ఎలా వస్తుంది. ఇది రాజధానికి రైతులు ఇఛ్చిన భూములను నిలువునా మోసం చేయటం కాదా?. చంద్రబాబు తన స్వప్రయోజనాల కోసం ఎంతకైనా తెగిస్తారనటానికే ఇదే ఉదాహరణ. సహజంగా రైతులకు వచ్చే వాణిజ్య భూముల ప్రాంతం పరిమితంగా ఉంటుంది. చంద్రబాబు ముడుపులు తీసుకుని ఇచ్చే భారీ సంస్థల ముందు రైతులు నిలబడగలరా?. చూస్తుంటే అమరావతి రైతులు నిండా మునగటం ఖాయంగా కన్పిస్తోందని అధికారులు చెబుతున్నారు.

 

 

 

 

Similar News