కడప ఉక్కు.. వైసీపీని బుక్ చేసిన టీడీపీ!

Update: 2018-06-22 04:09 GMT

కడప ఉక్కు విషయంలో తెలుగుదేశం పార్టీ సక్సెస్ ఫుల్ గా వైసీపీని బుక్ చేసింది. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప లో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కోరుతూ టీడీపీ ఎంపీ సీఎం రమేష్ నిరసన దీక్షకు దిగారు. అప్పటివరకూ మౌనంగా చూస్తూ వచ్చిన వైసీపీ కూడా రంగంలోకి దిగాల్సిన పరిస్థితి కల్పించింది టీడీపీ. ఈ ప్రాజెక్టు సాధన విషయంలో ప్రభుత్వ వైఫల్యం సంగతి పక్కన పెడితే..వైసీపీ కూడా ప్రత్యేక హోదా మీదే ఎక్కువ ఫోకస్ పెట్టింది కానీ..కడప స్టీల్ ప్రాజెక్టుపై అడపాదడపా మాట్లాడటం తప్ప..ప్రతిపక్షం కూడా పెద్దగా చేసింది కూడా ఏమీలేదనే చెప్పొచ్చు. రాజకీయంగా ఈ అంశాన్ని లేవనెత్తి అధికార పార్టీని ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నా..వైసీపీ ఈ అంశాన్ని ఉపయోగించుకోవటం విపలం అయింది.

టీడీపీ ఎంపీ దీక్షకు కూర్చున్న తర్వాత జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ధర్నాలు..నిరసనలకు సంబంధించిన కార్యాచరణ ప్రకటించటంతోపాటు...రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చింది వైపీపీ. అయితే అధికార పార్టీ ఓ అంశంపై నిరసన స్టార్ట్ చేశాక..ప్రతిపక్షం దీన్ని ఫాలో కావాల్సి రావటం రాజకీయంగా వైసీపీకి ఇబ్బందికర పరిణామామే. టీడీపీ నేతలు సహజంగానే ఈ పరిణామాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. ప్రతిపక్షం చేయాల్సిన పని తాము చేస్తున్నామని చెప్పుకుంటున్నారు ఇప్పటికే. అయితే వైసీపీ కూడా ప్రభుత్వ నిర్లక్ష్యంగానే కడప స్టీల్ ప్లాంట్ కార్యాచరణకు నోచుకోలేదని విమర్శలు గుప్పిస్తోంది.

 

Similar News