కెఈ కృష్ణమూర్తి సంచలన వ్యాఖ్యలు

Update: 2018-06-06 09:55 GMT

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె ఈ కృష్ణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. కెఈ వ్యాఖ్యలు టీడీపీలో ఒక్కసారిగా పెద్ద దుమారమే రేపాయి. కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు పెట్టుకుంటే తాను ఉరేసుకుంటానని కెఈ వ్యాఖ్యానించటం పెద్ద సంచలనంగా మారింది. కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదు. ఒకవేళ అదే జరిగితే నేను ఉరి వేసుకోవడానికి సిద్ధం.. ఇది నా వ్యక్తిగతం కాదు.. పార్టీ తరపునే చెప్తున్నా..కర్నూలు జిల్లాలో బీసీలపై కేఈ కుటుంబ పెత్తనమేమీ లేదన్నారు.’ ప్రజల ఆదరణతోనే తాను రాజకీయంగా ఎదిగాను. ధైర్యం ఉంటే నాతో, నా కుటుంబంతో పోటీ చేసి గెలవాలి. నాపై వ్యక్తిగత దూషణలకు దిగడం మానాలి. మరోవైపు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీల రాజీనామా ఓ నాటకం అని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ, బీజేపీ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ వల్లే రాజీనామాలు ఇప్పటివరకు ఆమోదం కాలేదు అని వ్యాఖ్యానించారు.

 

Similar News