‘ప్రత్యేక హోదా’ ఇవ్వని మోడీతో చంద్రబాబు అలా నవ్వుతారా?

Update: 2018-06-17 11:16 GMT

సహజంగా ఈ ఫోటోలో ఎలాంటి తప్పులేదు. నీతి అయోగ్ సమావేశంలో పాల్గొన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రధానికి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఒకరిని చూసి ఒకరు హాయిగా నవ్వుకున్నారు. పక్కన ఉన్న సీఎంలు కూడా అదే మూడ్ లో ఉన్నారు. కానీ చంద్రబాబు మాట్లాడే థీరీలకు మాత్రం ఇది వ్యతిరేకం. కేంద్రం నుంచి బయటికి వచ్చిన తర్వాత సుజనా చౌదరి ఓ కేంద్ర మంత్రికి షేక్ హ్యాండ్ ఇస్తే అలా ఎందుకు చేశారు?. ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళతాయి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు ఎవరిని కలవాలి? ఎలా కలవాలి. ఏమి మాట్లాడాలి.మొత్తం మేమే డిసైడ్ చేస్తాం అన్న తీరుగా వ్యవహరిస్తున్న చంద్రబాబు అండ్ కో ను మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఫోటోను. ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇఛ్చి అమలు చేయని మోడీతో అలా నవ్వుడూ షేక్ హ్యాండ్ (అదీ మోడీ ఎడమ చేయి) ఇస్తారా?.

రాజధానికి నిధులు ఇవ్వని, రైల్వే జోన్ ఇవ్వని, కడపకు స్టీల్ ప్లాంట్ ఇవ్వని, విభజన హామీలు అమలు చేయని. చంద్రబాబుపై కుట్రలు చేస్తున్న మోడీకి చంద్రబాబు ఎలా నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇస్తారు. చంద్రబాబు ధీరి ప్రకారం ఆయన వైపు నిప్పులు చెరుగుతూ చూడాలి కదా?. షేక్ హ్యాండ్ ఇవ్వటం కోసం మోడీ వచ్చినా కూడా చంద్రబాబు చెయ్యి ఇవ్వకూడదు కదా?. ఏపీకి ఆసరాగా నిలవని మోడీకి చంద్రబాబు ఇలా ఒకింత ఒంగి మరీ నవ్వుతూ మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అంటే చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడ్డారా?. నీతిఅయోగ్ సమావేశంలో చంద్రబాబు ఏమి చెప్పారో వేరే సంగతి. కానీ ఈ ఫోటో మాత్రం ఒక్కసారిగా వంద సందేశాలు పంపుతుంది.

 

Similar News