సోమిరెడ్డి క్షమాపణ

Update: 2018-05-27 13:11 GMT

‘బొక్కలో వేసి నాలుగు తంతే తెలుస్తుంది’ ఇవీ టీటీడీ మాజీ ప్రధాన అర్చకుడు ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. చంద్రబాబు అంటే అంత భయం లేకుండా పోయిందా?. నాశనం అయి పోతారు అంటూ రెచ్చిపోయారు. సోమిరెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. సోషల్ మీడియాలో మంత్రి వ్యాఖ్యలు తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో బ్రాహ్మణ సంఘాలు కూడా మంత్రి వ్యాఖ్యలను తప్పుపట్టాయి. దీంతో సోమిరెడ్డి వెనక్కి తగ్గారు. క్షమాపణ చెప్పారు.

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని అనాల్సిన మాటలను పొరపాటు రమణదీక్షితులను అన్నానని ప్రకటించారు. విజయవాడలో జరుగుతున్న మహానాడులో ఆయన ఈ వివరణ ఇచ్చారు. ‘బ్రాహ్మణుల ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉండాలని కోరుకునే వ్యక్తిని. అందుకే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను. ముఖ్యమంత్రి ఇంట్లో శ్రీవారి నగలు ఉన్నాయని ఎవరైనా ఆరోపిస్తే.. తెలంగాణలో అయితే ఖచ్చితంగా బొక్కలోవేసి ఇంటరాగేషన్‌ చేసేవారు. అసలు వేంకటేశ్వర స్వామి నగల గురించి మాట్లాడినందుకు శిక్షించేవారు..’’ అని సోమిరెడ్డి అన్నారు.

 

 

Similar News