అమిత్ షాకు కిచెన్ చూపినందుకే నాపై వేటు

Update: 2018-05-22 07:51 GMT

వేటుపడిన టీటీడీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేశారు. రిపబ్లిక్ టీవీ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలు ప్రస్తావించారు. ‘ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారికంగా దేవస్థానం డబ్బులు తీసుకుంటున్నారు. కడప జిల్లాలో ఓ దేవాలయం అభివృద్ధికి అని. సైన్స్ కాంగ్రెస్ కు ప్రధాని వచ్చిన సమయంలో తిరుపతి పట్టణ సుందరీకరణ కోసం టీటీడీ నిధులు వాడారు. ఒంటిమిట్ట దేవాయలం కోసం పత్రాల్లో ఉన్న దాని ప్రకారం వంద కోట్ల రూపాయలు తీసుకున్నారు. తిరుపతిలో కాంక్రీట్ రోడ్డు కోసం పది కోట్ల రూపాయలు తీసుకున్నారు. దేవాయలం నిధులతో ఇలా చేయటానికి నిబంధనలు అనుమతించవు. ప్రస్తుతం టీటీడీ ప్రభుత్వ బ్రాంచ్ ఆఫీసులాగా ఉంది. అధికారులు, సిబ్బంది అందరూ ప్రభుత్వం..సీఎం నియమించిన వారే. గుడిలో జరిగే ప్రతి పనికీ సీఎం ఆమోదం ఉంటుంది. ఆయన నియమించిన వారే ఇక్కడ పనిచేస్తున్నారు. నేను అమిత్ షాను కిచెన్ లోకి తీసుకెళ్లి..ఆయనకు అన్నీ చూపించినందుకే ‘భాధితుడు’గా మారాల్సి వచ్చింది. 50 వేల కోట్ల రూపాయల విలువ చేసే ఆభరణాలు రిటైర్డ్ ఉద్యోగి డాలర్ శేషాద్రి వద్ద పెట్టారు.

గుడిలో జరిగే ప్రతి పనినీ చంద్రబాబే నియంత్రిస్తున్నారు. గత వారం బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వెంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చారు. ప్రోటోకాల్ ప్రకారం నేను ఆయనకు స్వాగతం పలికి లోపలికి తీసుకెళ్ళాను. సంప్రదాయం ప్రకారం ఆశీస్సులు అందజేసిన తర్వాత అమిత్ షాను లోపల ఉన్న కిచెన్ కు తీసుకెళ్ళాను. అక్కడ ఏమి జరిగిందో నేను చూపించాను. ఈ కిచెన్ దేవుడికి ప్రసాదాలు సిద్దం చేయటానికే వాడతారు. గత 1000 సంవత్సరాలుగా ఇదే జరుగుతోంది. అది ఎప్పుడూ మూసేయలేదు. మూసినట్లు ఆధారాలు కూడా లేవు. కానీ గత ఏడాది జూన్-డిసెంబర్ మధ్య కాలంలో కిచెన్ మూసేశారు. ఆగమశాస్త్రాల సలహాదారుగా ఈ విషయాన్ని నాకు చెప్పాలి. ఆగమ శాస్త్రం ప్రకారం అక్కడే చేస్తున్న మార్పులు తెలియజేయాలి. కానీ అలా జరగలేదు. కానీ ప్రసాదాలు మొదటి ప్రాకారంలో కాకుండా బయట ఎక్కడో తయారు చేశారు. శాస్త్రాల ప్రకారం ఇలా చేయటం సరికాదు. తర్వాత నేను కిచెన్ లోకి వెళ్లి చూశా. అక్కడ ఇటుకలు తీసి ఉన్నాయి. ఫ్లోరింగ్ తీసి ఉంది. అక్కడ వాతావరణం భూ కంపం వస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. తర్వాత ఈవోను పిలిచాం. ఏమి జరుగుతుందని ప్రశ్నించా?. ఈవో కూడా నాకు తెలియదని చెప్పారు.

ఆయనకు కూడా ఖచ్చితంగా సమాచారం ఇవ్వాలి. తనిఖీ చేసి నివేదిక ఇవ్వమని అడిగారు. తర్వాత జెఈవో శ్రీనివాసరాజు, చీఫ్ ఇంజనీర్ కూడా వచ్చారు. కొంత మంది తవ్వకాలు జరిపి అక్కడ ఉన్న నిక్షేపాలు వెతికారు. పల్లవ, చోళ రాజులు ఇఛ్చిన ఆభరణాలు, నగలు రహస్యంగా అక్కడ దాచిపెట్టిననట్లు మా పెద్దలు చెప్పారు. నిక్షేపాల కోసం కిచెన్ లో తవ్వకాలు జరిపారు.అందులో సందేహం లేదు. అంతే కాదు సీఎం ఆదేశాల మేరకే ఓ పురాతన కోటలో కూడా ఏపీలో తవ్వకాలు జరిగాయి. ఇది కూడా దాచిపెట్టిన నిధి, నిక్షేపాల కోసమే. ఖనిజాల పేరు చెప్పి ఈ పనులు చేశారు. ప్రభుత్వం నియమించిన అధికారులు..టీటీడీ సిబ్బందే ఈ పనిచేయాలి. బయటి వాళ్ళకు సాధ్యం కాదు. తర్వాత కిచెన్ కొత్త ఫ్లోరింగ్ వేయటంతో పాటు..అన్నీ మార్పులు చేశారు.’ అని తెలిపారు.

 

https://www.youtube.com/watch?v=p5SZ4hcueZI

Similar News