‘పవన్’ పోరాటయాత్ర తొలి రోజు సంచలన వ్యాఖ్యలు

Update: 2018-05-20 07:14 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పొరాట యాత్ర తొలి రోజే సంచలన వ్యాఖ్యలు చేశారు. యువత మద్దతు, పెద్దల అశీస్సుల ఉంటే 2019లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. తాను పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదని...పనిచేద్దామనే వచ్చామన్నారు. అయితే తాను మిగిలిన పార్టీల తరహాలో కులాలను విడదీసి పబ్బం గడుపుకోవాలని చూడనని..ప్రజల ఆశీర్వాదం ఉంటే ముఖ్యమంత్రి అవుతానని ప్రకటించారు. మత్సకారుల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. తన పర్యటనలో ప్రజా సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించారు. పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురంలో ఆదివారం నాడు తన యాత్ర ప్రారంభించారు. ఉత్తరాంద్రలో ఈ పర్యటన 45 రోజుల పాటు సాగనుంది.

తన పర్యటనల కోసం సిద్ధం చేసుకున్న బస్సు నుంచి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ పర్యటనలు అన్నీ పూర్తి అయిన తర్వాత వచ్చే ఎన్నికలకు సంబంధించి పవన్ కళ్యాణ్ మేనిఫెస్టోను ప్రకటించనున్నారు. పవన్ తన పర్యటనల్లో ముఖ్యంగా ప్రత్యేక హోదా, రైల్వే జోన్ వంశాలపై ఫోకస్ పెట్టనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. గతంలో ఇదే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పదవి చేపట్టానికి అనుభవం కావాలని వ్యాఖ్యానించారు. ఇఫ్పుడు మాత్రం మారిన పరిస్థితుల్లో తన వైఖరిని స్పష్టం చేశారు. ప్రజా సేవే జనసేన సిద్ధాంతం అని ప్రకటించారు.

 

Similar News