ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలుగుదేశం అధినేత ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడా?. ఆయన చెప్పిన దాని ప్రకారం అయితే అలాగే అయి ఉండాలి. ప్రధాని మోడీ ఆయన్ను గుర్తించి ఈ స్వయంప్రకటిత నిప్పుకు ‘ స్వాతంత్ర సమరయోధుడి ఫించను’ కూడా ఇప్పిస్తే ఓ పనై పోతుంది. సోమవారం నాడు తిరుపతిలో నిర్వహించిన ధర్మపోరాట దీక్షలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అందరి ఫ్యూజులు ఎగిరిపోయేలా చేశాయి. ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబు కేంద్ర సర్కారుకు ఎంత భయపతున్నారో అర్థం అవుతోందని టీడీపీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు . అదేంటి అంటే ‘మమ్మల్ని భయపెడతారా?. బ్రిటీష్ వాళ్ళపైనే పోరాడిన జాతి ఈ తెలుగుదేశం పార్టీ’ అట. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని పెట్టిందే 1982 మార్చి 29న . మరి ఈ లెక్కన టీడీపీ బ్రిటీషర్లతో టీడీపీ ఎక్కడ పోరాడిందో చంద్రబాబుకే తెలియాలి. చంద్రబాబులో భయం ఏ స్థాయిలో ఉందో ఈ వ్యాఖ్యలే నిరూపిస్తున్నాయని టీడీపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కొద్ది రోజుల క్రితం కూడా అంతే. కేంద్రం తనపై దాడి చేస్తే ప్రజలు అంతా రక్షణ వలయంలా నిలబడి కాపాడాలి అని కోరారు.
అసలు కేంద్రం ఎందుకు దాడి చేస్తుంది...ఓ ముఖ్యమంత్రిని ప్రజలు కాపాడటం ఏమిటి?. ఇవి కూడా అప్పట్లో చర్చనీయాంశాలుగా మారాయి. ఇప్పుడు ఏకంగా బ్రిటీషర్లతో పోరాడిన పార్టీగా తెలుగుదేశం పార్టీని పోల్చుతూ కేంద్రానికి హెచ్చరికలు చేశారు. ఏ స్థాయిలో భయపడకపోతే చంద్రబాబు ఇంతలా షాకింగ్ వ్యాఖ్యలు చేస్తారనుకోవాలి. నారా లోకేష్ కు అయితే ఇలాంటి మాటలు మాట్లాడటం నిత్యకృత్యమే. దేశ రాజకీయాల్లో తాను తప్ప సీనియర్ లేరని...40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు ఇంతలా భయపడటానికి కారణాలేమిటి?. మెయిన్ లైన్ మీడియా చూపించని... వెలుగులోకి రాని స్కామ్ లు ఇంకా చాలా చేశారని అనుకోవాలా?. లేకపోతే ఎందుకీ భయం?.
Founded | 29 March 1982 (36 years ago) |