మంత్రి భూమా అఖిలప్రియ నిశ్చితార్థం

Update: 2018-05-12 06:54 GMT

ఆంధ్రప్రదేశ్ కు చెందిన పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. శనివారం నాడు హైదరాబాద్ లో అఖిలప్రియ నిశ్చితార్థం జరిగింది. వరుడు భార్గవ్ తో ఈ నిశ్చితార్థ కార్యక్రమం జరిగింది. భార్గవ్ ఏపీ మాజీ డీజీపీ సాంబశివరావు అల్లుడు. ఆగస్టు 29న వీరి పెళ్లి జరగనున్నట్లు సమాచారం. అఖిలప్రియ, భార్గవలు గత కొంత కాలంగా ప్రేమలో ఉన్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

ఈ వ్యవహారం ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు..ప్రభుత్వంలో ఉన్న వారందరికీ తెలిసిన సంగతే అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి 2010లోనే భూమా అఖిలప్రియ వివాహం జరిగింది. వైసీపీ నేత రవీంద్రారెడ్డి తనయుడుతో ఈ పెళ్ళి జరిగింది. కానీ తర్వాత వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. అఖిలప్రియ నిశ్చితార్థానికి పరిమిత సంఖ్యలోనే అతిధులను ఆహ్వానించినట్లు సమాచారం.

 

Similar News