ఏపీ నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రజలు 75 కోట్ల రూపాయల విరాళాలు ఇచ్చారని టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. మహానాడులో మాట్లాడుతూ ఈ విషయం తెలిపారు. ఈ మధ్యే ఓ ఎన్ఆర్ఐ డాక్టర్ పది లక్షల రూపాయలు ఇఛ్చారని..ఓ విద్యార్థిని తన కిడ్డీ బ్యాంకులోని లక్ష రూపాయలు కూడా రాజధానికి ఇచ్చారని తెలిపారు. నార్మన్ ఫోస్టర్ అమరావతికి సంబంధించి ప్రపంచంలోనే అత్యుత్తమ డిజైన్లు అందించిందని తెలిపారు. అమరావతి ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా మారుతుందన్నారు. కేంద్రం అమరావతికి నిధులు ఇవ్వకుండా విమర్శలు చేస్తోందని మండిపడ్డారు. అద్భుతమైన రాజధాని కట్టే సామర్ధ్యం తనకుందన్నారు.
సింగపూర్ ప్రభుత్వం తన విశ్వసనీయతను చూసి వెంటనే మాస్టర్ ప్లాన్ అందజేసిందని తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో రాష్ట్రాభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. రాజధాని అభివృద్ధికి 45 వేల కోట్ల రూపాయలు కావాలన్నారు. ఇఫ్పటికే 22 వేల కోట్ల రూపాయల పైబడిన పనులకు టెండర్లు పిలిచామన్నారు. రాజధానికి నిధులెవ్వని కేంద్రానికి పన్నులెందుకు కట్టాలని చంద్రబాబు ప్రశ్నించారు. అమరావతి శంకుస్థాపన సమయంలో ప్రధాని నరేంద్రమోడీ చేసిన ప్రసంగ వీడియోను మహానాడులో వేసి ప్రదర్శించారు.
బొమ్మలకూ ఆ ‘డమ్మీ’ అధ్యక్షులు అర్హు