అవిశ్వాసంపై మళ్ళీ అదే సీన్

Update: 2018-04-02 06:50 GMT

నాలుగు రోజుల విరామం అనంతరం లోక్ సభలో మళ్ళీ అదే సీన్. సోమవారం కూడా ఎప్పటిలాగానే అన్ని పార్టీలు అవిశ్వాస తీర్మానానికి సంబంధించి నోటీసులు ఇచ్చాయి. అయినా సభ ఆర్డర్ లో లేదనే కారణంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ వీటిని అనుమతించలేదు. సభ ఆర్డర్ లో లేకపోతే సభ్యులను లెక్కించటం కష్టం అంటూ లోక్ సభను మంగళవారానికి వాయిదా వేశారు. అధికార పార్టీ తీరు చూస్తుంటే అవిశ్వాసనం సభలో చర్చకు వచ్చే అవకాశం కన్పించటం లేదు.

సోమవారం ఉదయం సభ ప్రారంభం కాగానే ఎప్పటిలాగానే ఏఐడీఎంకె సభ్యులు పోడియం ను చుట్టుముట్టి నినాదాలు చేశారు. కావేరి బోర్డు ఏర్పాటు చేయాలంటూ వారు నినాదాలు కొనసాగించారు. తిరిగి 12 గంటలకు సభ ప్రారంభం అయినా అదే సీన్ ఉండటంతో సభను వాయిదా వేశారు. రాజ్యసభలోనూ అదే పరిస్థితి. రాజ్యసభ అయితే ఓ రెండు నిమిషాలు జరిగాక ఏకంగా ఒకేసారి మంగళవారానికి వాయిదా వేశారు.

 

Similar News