జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ, ఏబీఏన్ ఎండీ రాధాకృష్ణపై తన ఎటాక్ కొనసాగిస్తూనే ఉన్నారు. సోమవారం ఉదయం ట్విట్టర్ వేదికపై తనదైన శైలిలో విమర్శలు ప్రారంభించారు. అమెరికా రాజ్యాంగం ముందు మాటలో ‘మేం దేవుడిని నమ్ముతాం’ అని ఉంటుంది. తెలుగుదేశం రాజ్యాంగం ముందు మాటలో ‘మేం దూషణలను నమ్ముతాం’ అని ఉంటుంది. మిగతా అంతా సేమ్ టూ సేమ్ అని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. తెలుగుదేశంలో తల్లి..చెల్లిని తిట్టే విభాగానికి ప్రధాన కార్యదర్శి ఎవరో తెలుసా?. బూతు జ్యోతిరత్న ‘ఆర్ కె’ అని ట్వీట్ చేశారు.
తెలుగుదేశం నేతలు ప్రత్యేక హోదా సాధనకు ఓ గొప్ప మార్గం కనిపెట్టారు. అది ప్రదానిని అన్ పార్లమెంటరీ భాషలో..అభ్యంతకరంగా తిట్టడమే అని పేర్కొన్నారు. ఈ సలహా ఇఛ్చింది కూడా ఖచ్చితంగా ఆర్ కె అయ్యుండొచ్చు అని వ్యాఖ్యానించారు. తమ చేతిలో అధికారం లేదు కాబట్టి..ఆర్ కె మీరు చేసే దూషణలు భరిస్తామని పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా పవన్ మీడియాను టార్గెట్ చేస్తూ ట్విట్టర్ వేదికగా హల్ చల్ సృష్టిస్తున్నారు.