టీటీడీ కొత్త బోర్డు సభ్యులు వీరే

Update: 2018-04-20 14:57 GMT

ఏడాది పాటు జాప్యం తర్వాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎట్టకేలకు టీటీడీ బోర్డు నియామకం చేపట్టారు. తొలుత టీటీడీ బోర్డు ఛైర్మన్ గా పుట్టా సుధాకర్ యాదవ్ ను నియమించారు. శుక్రవారం నాడు నూతన బోర్డు సభ్యులను ప్రకటించారు. సభ్యులుగా ఎంపీ రాయపాటి సాంబశివరావు, ఎమ్మెల్యే జీఎస్‌ఎస్‌ శివాజీ, ఎమ్మెల్యే బోండా ఉమ, ఎమ్మెల్యే అనిత, ఎమ్మెల్యే పార్థసారధి, ఎమ్మెల్యే చల్లా రామచంద్రారెడ్డి, పొట్లూరి రమేష్‌ బాబు, మాజీ ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు, మేడా రామచంద్రా రెడ్డి, డొక్కా జగన్నాధం, సండ్ర వెంకట వీరయ్య(తెలంగాణ), ఇనుగాల పెద్దిరెడ్డి(తెలంగాణ), సుధా నారాయణ మూర్తి(కర్ణాటక), సప్న మునగంటివార్ (మహారాష్ట్ర) నియమితులయ్యారు. పొట్లూరి రమేష్‌ బాబు న్యాయ వ్యవస్థలో కీలక స్థానంలో ఉన్న వ్యక్తి సమీప బంధువు అని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే బోర్డు కూర్పుపై పార్టీ వర్గాల్లోనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పూర్తిగా రాజకీయ కోణంలోనే బోర్డు ఉంది తప్ప..ఎక్కడా ఆథ్యాత్మిక భావం ఉన్న వారు కన్పించటం లేదని చెబుతున్నారు.

 

Similar News