సీనియర్ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ పొలిటికల్ ఎంట్రీకి లైన్ క్లియర్ అయింది. ఆయన చేసుకున్న స్వచ్చంద పదవి విరమణ దరఖాస్తుకు మహారాష్ట్ర సర్కారు ఆమోదముద్ర వేసింది. రాజకీయాల్లో ప్రవేశించేందుకే ఆయన వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో లక్ష్మీనారాయణ ఉమ్మడి రాష్ట్రంలో సీబీఐ జాయింట్ డైరక్టర్ గా పనిచేసిన సంగతి తెలిసిందే.
అయితే ఆయన ఇఫ్పుడు ఏ పార్టీలో చేరతారు అన్నది ఆసక్తికరంగా మారింది. జనసేనలో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే కొంత మంది మాత్రం బిజెపిలో చేరతారని చెబుతున్నారు. అయితే కొన్ని రోజులు గడిస్తే కానీ దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం లేదు. కొద్ది రోజులుగా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ తన దరఖాస్తు ఆమోదం పొందాకే ఏదైనా మాట్లాడతానని చెబుతూ వచ్చారు.