అది మీకు పెద్ద షో అవుతుంది...చూడండి

Update: 2018-04-24 04:39 GMT

‘ఓ సోదరి బట్టలు విప్పదీయటాన్నిప్రోత్సహించి..దాన్ని షో చేశారు. పేరున్న కుటుంబాలు, రాజకీయవేత్తలు, మీడియా బ్యారన్స్, వాళ్ళ పిల్లలు పేర్లు బయటికొస్తున్నాయి. ఇవన్నీ చూస్తే సమాజ నగ్నత్వమే బయటపడుతుంది. వీటిని కూడా షో గా మారిస్తే ఇది ‘మదర్ ఆఫ్ ఆల్ షోస్’గా నిలుస్తుంది.’ అని వ్యాఖ్యానించారు పవన్ కళ్యాణ్. మంగళవారం ఉదయమే ఆయన ట్విట్టర్ లో పలు ట్వీట్లు చేశారు. తెలంగాణ పోలీసులను నేను ఓ విన్నపం చేయాలనుకుంటున్నాను. గత ఆరు నెలల నుంచి సాగుతున్న వ్యవహారాలపై విచారణ జరిపించాలని. ఇది జరిగితే పురుషులు అయినా..మహిళలు అయినా అన్ని పేర్లు అమరావతివైపే దారితీసే అవకాశమే కన్పిస్తోంది.

నన్ను బద్నాం చేసేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నారు. పనిలో పనిగా శ్రీనిరాజుపై పవన్ తన దాడిని కొనసాగించారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఐఎస్ బిలో బోర్డు డైరక్టర్ గా ఉన్న ఆయన అత్యంత అభ్యంతరకరమన కంటెంట్ తో కూడిన వార్తలు ప్రసారం చేయటాన్ని అనుమతిస్తారు.. ఆ ఛానల్ లో ఆయనదే అధిక వాటా. కొన్ని ప్రతిష్టాత్మక సంస్థల ఔన్నత్యాన్ని కాపాడండి అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. టీవీ9 సీఈవో రవిప్రకాష్ కు సంబంధించి పాత క్లిప్పింగ్ లను ట్విట్టర్ లో పోస్టు చేశారు పవన్ కళ్యాణ్.

 

 

 

 

Similar News