జగన్ కేసులో ఈడీకి ఝలక్

Update: 2018-03-07 16:04 GMT

జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఈడీ) చర్యలను అప్పీలేట్ ట్రిబ్యునల్ తప్పుపట్టింది. ఈ పరిణామం జగన్ కేసులో కీలకంగా మారే అవకాశం కన్పిస్తోంది. జగన్ కు చెందిన సంస్థ జగతి పబ్లికేషన్స్ లో ముగ్గురు వ్యాపారులు పెట్టిన పెట్టుబడికి సంబంధించి ఈడీ 34.64 కోట్ల రూపాయల ఆస్తులను స్వాధీనం చేసుకుంది. అయితే ఈడీ చర్యలను ట్రిబ్యునల్ ఆక్షేపించింది. అదే సమయంలో ఈడీ ఉత్తర్వులను కూడా కొట్టివేసింది.

మోసపూరితంగా పెట్టుబడులు సేకరిస్తే అది మనీలాండరింగ్ ఎలా అవుతుందని ట్రిబ్యునల్ ప్రశ్నించింది. జగతి పబ్లికేషన్స్ కు సంబంధించి 34.64 కోట్ల రూపాయల ఆస్తులను జప్తు చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను ట్రిబ్యునల్ కొట్టివేసింది. జగతి పబ్లికేషన్స్ లో టీ ఆర్ కణ్ణన్, ఏ కె దండమూడి, మాధవ్ రామచంద్రన్ లు ఈ మేరకు పెట్టుబడి పెట్టిన విషయం తెలిసిందే. అప్పీలేట్ ట్రిబ్యునల్ ఆదేశాలు కీలక పరిణామంగా భావిస్తున్నారు.

 

Similar News