రవితేజ మళ్ళీ స్పీడ్ పెంచాడు. ఇప్పటికే రాజా ది గ్రేట్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన ఈ మాస్ మహారాజా కొత్తగా ‘టచ్ చేసి చూడు’ అంటూ ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకు విడుదలకు ముందే మరో కొత్త సినిమాకు రెడీ అయిపోయాడు. అది కూడా జనవరి 5న ప్రారంభం కానుంది. ఈ సినిమాలో రవితేజ జోడీగా కొత్త హీరోయిన్ మళవిక శర్మ నటించనున్నారు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా ప్రారంభం కానుంది.
కామెడీ ఎంటర్‌టైనర్ గా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. తొలుత ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు రకుల్ ప్రీత్ సింగ్ ను తీసుకోవాలని అనుకున్నారు. రవితేజ, రకుల్ కాంబినేషన్ లో వచ్చిన కిక్ 2 ఫ్లాప్ కావటంతో వేరే హీరోయిన్ కోసం ప్రయత్నించారు. యాడ్ ఫిలింస్ తో ఆకట్టుకున్న మాళవిక శర్మ, హిమాలయ గర్ల్ గా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు రవితేజ సరసన నేల టికెట్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అవుతోంది.