రవితేజ తన కొత్త సినిమాతో రెడీ అయ్యాడు. అదీ కొత్త సంవత్సరంలో సందడి చేయటానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. సుదీర్ఘ గ్యాప్ తర్వాత ఈ ఏడాది విడుదలైన రవితేజ సినిమా రాజా ది గ్రేట్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని దక్కించుకుంది. ఇదే జోష్ తో టచ్ చేసి చ డు సినిమా కూడా హిట్ కొడుతుందనే ఈ ధీమాతో ఉన్నాడు ఈ మాస్ మహారాజా రవితేజ. ఈ సినిమాను విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో నల్లమలుపు బుజ్జి, వల్లభనేని వంశీలు నిర్మిస్తున్నారు.
రవితేజ సరసన రాశీఖన్నా, సీరత్ కపూర్ లు హీరోయిన్లు గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్న ఈసినిమాను రవితేజ పుట్టిన రోజు కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. జనవరి 26న రవితేజ పుట్టిన రోజు కావటంతో ఒక్క రోజు ముందు జనవరి 25న సినిమా రిలీజ్ చేయనున్నారని ఫిల్మ్ నగర్ టాక్.