అదేంటో ఈ మధ్య రామ్ గోపాల్ వర్మకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏమి చేసినా తెగనచ్చేస్తోంది. ఈ మధ్య పవన్ వరసగా మూడు రోజులు ఏపీలో పర్యటించి..పలు సమావేశాల్లో మాట్లాడారు. పవన్ స్పీచ్ లు చూస్తే ఆయన మంచి నాయకుడు అయ్యే అవకాశం ఉందని వర్మ వ్యాఖ్యానించారు. ఇది పాత కథ. కొత్తగా ‘అజ్ఞాతవాసి’ సినిమా టీజర్ పై కూడా వర్మ కామెంట్ చేశారు.
‘అజ్ఞాతవాసి’ ట్రైలర్ అద్భుతంగా ఉందని..పవన్ చాలా అత్యుత్తమంగా కన్పించారని వ్యాఖ్యానించారు. వర్మతో పాటు రామ్ చరణ్ కూడా టీజర్ పై స్పందించారు. టీజర్ లో పవన్ ప్రతి ఎక్స్ ప్రెషన్ సూపర్ గా ఉందని అంటూ...ఈ సినిమా విడుదల అయ్యే సంక్రాంతి సమయం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.