నిర్మాత, నటుటు కళ్యాణ్ రామ్ షూటింగ్ లో ప్రమాదానికి గురయ్యారు. వికారాబాద్ ప్రాంతంలో షూటింగ్ జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. కల్యాణ్ రామ్ జయేంద్ర దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని మహేష్ కోనేరు నిర్మిస్తున్నారు. యాక్షన్ సీన్స్ ను తెరకెక్కిస్తుండగా కల్యాణ్ రామ్ గాయపడ్డారని మహేష్ కోనేరు ట్వీట్ చేశారు.
యాక్షన్ సీన్స్ జరుగుతున్నప్పుడు కల్యాణ్ గాయపడ్డారు. కానీ షూటింగ్ కు ఎలాంటి ఇబ్బంది లేకుండా పెయిన్ కిల్లర్స్ వేసుకుని ఆయన ఈరోజు (శుక్రవారం) సెట్స్ కు వచ్చారు. ప్రొఫెషన్ పైన ఆయనకున్న డెడికేషన్ కి హాట్సాఫ్' అని ట్వీట్ చేశారు. కళ్యాణ్ రామ్ ఎమ్మెల్యే పేరుతో మరో సినిమా కూడా చేస్తున్నారు.