టాలీవుడ్ ‘ట్విట్టర్ హీరో’ మహేష్ బాబు

Update: 2017-12-17 13:46 GMT

ఆయన పెద్దగా ట్విట్టర్ లో హంగామా చేయరు. నిత్యం ఫోటోలు..అప్ డేట్స్ ఏమీ పెట్టరు. అయినా సరే టాలీవుడ్ ట్విట్టర్ హీరోగా మహేష్ బాబు నిలిచారు. ట్విట్టర్ లో మహేష్ బాబును ఫాలో అవుతున్న వారు ఏకంగా 50 లక్షలు (ఐదు మిలియన్లు) దాటేశారు. టాలీవుడ్ లో ఈ ఘనత సాధించిన హీరో మహేష్ బాబు ఒక్కరే. ఈ విషయాన్ని మహేష్ బాబు భార్య నమ్రత ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. మహేష్ బాబుపై ఇంతటి ప్రేమాభిమానాలు చూపుతున్న అబిమానులకు ఆమె థ్యాంక్స్ చెప్పారు. మహేష్ బాబును ఏభై లక్షల మంది ఫాలో అవుతుండగా...మహేష్ బాబు మాత్రం తన భావ గల్లా జయదేవ్ ఒక్కరినే ఫాలో అవుతున్నారు.

టాలీవుడ్ లో చాలా మంది హీరోలు ఎక్కువగా తమ సినిమాలకు చెందిన అంశాలపైనే సామాజిక మాధ్యమాల్లో స్పందిస్తారు తప్ప..పెద్దగా ఇతర అంశాలపై ఏమీ మాట్లాడరు. వీరిని ఫాలో అయ్యే వారిలో ఎక్కువ మంది అభిమానులే ఉంటారు. తమ అభిమాన హీరోలకు చెందిన అప్ డేట్స్ తెలుసుకునేందుకు ఈ మార్గాన్ని ఎంచుకుంటారు. సోషల్ మీడియా పెరిగిపోయిన తర్వాత హీరోలకు సంబంధించిన అంశాల ప్రచారానికి ఇది ఓ కీలక మాధ్యమంగా మారిపోయింది. మహేష్ బాబు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘భరత్ అను నేను’ సినిమాలో హీరోగా చేస్తున్న సంగతి తెలిసిందే.

 

 

 

Similar News