అక్కినేని అఖిల్ మరో సినిమాకు రెడీ అయ్యాడు. తొలి సినిమా ‘అఖిల్’ నిరాశపర్చింది. దీంతో రెండవ సినిమా విషయంలో ఆచితూచి అడుగులు వేశాడు. అదీ సొంత బ్యానర్ లో మనం వంటి హిట్ ఇఛ్చిన దర్శకుడు విక్రమ్ కె కుమార్ తో ముందుకొచ్చాడు. అదేమి విచిత్రమో కానీ..హలో సినిమాకు అంత సీన్ లేకపోయినా మీడియా మాత్రం ఈ సినిమాకు ఎక్కడలేని ప్రాధాన్యత ఇచ్చింది. అయితే ఇందులో అఖిల్ నటనకు ఎక్కడా వంక పెట్టడానికి వీల్లేదు. కాకపోతే కథలోనే దమ్ములేదు. అయినా సరే సినిమాకు మీడియాలో దక్కిన ప్రచారంతో పాటు..వరస సెలవులతో కూడా కలెక్షన్లు భారీ ఎత్తున వచ్చినట్లు టాక్.
తన మూడవ సినిమాకు సంబంధించిన కీలక ప్రకటన జనవరి 10న చేయనున్నట్లు తెలిపాడు. అయితే ఈ సినిమాకు దర్శకుడు ఎవరై ఉంటారా? అన్న చర్చ జోరుగా సాగుతోంది. అఖిల్ తదుపరి ప్రాజెక్టు కోసం బోయపాటి, సుకుమార్ లతో చర్చలు జరుగుతున్నాయన్న ప్రచారం సాగుతోంది. అయితే ఈ సస్పెన్స్ కు జనవరి 10న తెరపడనుంది.