టీజర్ విడుదలై ఇరవై నాలుగు గంటలు కాకముందే అజ్ఞాతవాసి రికార్డులు సృష్టిస్తోంది. పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ పరిణామంతో కుషీ కుషీగా ఉన్నారు. అజ్ఞాతవాసిలో పవన్ కళ్యాణ్ కు జోడీగా కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. టీజర్ తోనే టాలీవుడ్ లో పవన్ సినిమా కొత్త రికార్డు క్రియేట్ చేసింది.
ఆదివారం ఉదయానికే ఈ టీజర్ రకు ఏకంగా మూడు లక్షల అరవై ఐదు వేల లైక్ లు వచ్చాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కొత్త సంవత్సరం జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అజ్ఞాతవాసి ఆడియో వేడుక ఈ నెల19న అట్టహాసంగా జరగనుంది. హారిక అండ్ హాసిన బ్యానర్ పై ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.