అజ్ఞాతవాసి..ఎంసీఏలకు షాక్ !

Update: 2017-12-20 15:58 GMT

ఒకటి సంక్రాంతికి వచ్చే సినిమా. మరొకటి ఎంసీఏ. గురువారం నాడే విడుదల కానుంది. ఈ రెండు భారీ సినిమాలకు ఊహించని షాక్. విడుదలకు ముందే రెండు సినిమాలు పైరసీ బారిన పడినట్లు నిర్మాతలు గుర్తించారు. అంతే వేగంగా రెండు సినిమాల నిర్మాతలు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారం టాలీవుడ్ లో కలకలం రేపింది. విడుదల అయిన తర్వాత పైరసీ అయిన ఉదంతాలు ఉన్నాయి కానీ..ఈ సారి రెండు పెద్ద సినిమాలు విడుదలకు ముందే పైరసీ బారిన పడటం కలకలం రేపుతోంది. అయితే కొంత మంది శాటిలైట్ మార్గంలో కూడా పైరసీకి పాల్పడుతున్నట్లు చెబుతున్నారు.

అజ్ఞాతవాసి, ఎంసీఏ సినిమాల నిర్మాతలు రాధాకృష్ణ, దిల్‌ రాజులు బుధవారం హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఫిర్యాదు చేసేందుకు సీసీఎస్‌ కార్యాలయానికి వచ్చిన నిర్మాత దిల్‌ రాజు మీడియాతో మాట్లాడారు. ఎంసీఏ సినిమాను విడుదలకు ముందే పైరసీ చేస్తామని కొందరు బెదిరిస్తున్నారని దిల్ రాజు ఆరోపించారు. డబ్బుల కోసం డిమాండ్‌ చేస్తున్నారు. ఇంతకుముందు జవాన్‌ సినిమా అప్పుడు కూడా ఇలాంటి బెదిరింపులే వచ్చాయని తెలిపారు. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించారు.

 

 

 

Similar News