పవన్ ‘కొడక’ పాట డిసెంబర్ 31

Update: 2017-12-27 14:08 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్వయంగా పాడిన కొడకా కోటేశ్వరరావు పాడ విడుదల ముహుర్తం ఖరారైంది. ఈ పాటను డిసెంబర్ 31 సాయంత్రం ఆరు గంటలకు విడుదల చేయనున్నట్లు ‘అజ్ఞాతవాసి’ చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ పాటకు సంబంధించిన బిట్ తో ఓ వీడియోను కూడా విడుదల చేశారు. అందులో కొడకా....అన్న వాయిస్ ఒక్కటే ఉంది. అంతకు ముందు పాట అందుకోవటానికి పవన్ పడే పాట్లు...దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నవ్వులు విన్పిస్తాయి.

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అజ్ఞాతవాసి’ సినిమాలో పవన్ కళ్యాణ్ జోడీగా కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయల్ సందడి చేయనున్నారు. పవన్ కళ్యాణ్ కాటమరాయుడు సినిమాలో ఓ పాట పాడిన విషయం తెలిసిందే. జనవరి 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సంక్రాంతి బరిలో ‘అజ్ఞాతవాసి’తోపాటు బాలకృష్ణ హీరోగా నటించిన జై సింహలు మాత్రమే పోటీపడనున్నాయి.

https://www.youtube.com/watch?time_continue=41&v=g8kzR3wEk-E

 

Similar News