పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఎలా ఉండబోతున్నదీ టీజర్ లోనే తెలిసింది. చిత్ర యూనిట్ శనివారం సాయంత్రం ఈ సినిమాను టీజర్ విడుదల చేసింది.ఇది పవన్ కళ్యాణ్ అభిమానులు..సినీ ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటోంది. టీజర్‌లో ఐటి ఫ్రొఫెషనల్ గా మంచి లుక్స్‌తో కనిపించిన పవన్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేస్తున్నారు. మధురా.. అని ప్రారంభమయ్యే పాట టీజర్ మొత్తం సాగుతుంది. చివర్లో పవన్.. ‘ఓ మై గాడ్’ అనే ఒక్కమాట మాత్రమే టీజర్‌లో ఉంది. కీర్తి సురేష్ పవన్ బుగ్గలు లాగే సన్నివేశం ఉంది. కాగా, అజ్ఞాతవాసి ఆడియో ఈ నెల 19వ తేదీన విడుదల కానుంది.
‘అజ్ఞాతవాసి’లో కీర్తి సురేశ్‌తోపాటు అను ఇమ్మాన్యుయేల్ మరో కథానాయికగా నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. అనిరుధ్ బాణీలు అందిస్తున్నారు. జనవరి 10న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ బ్లాక్‌బస్టర్స్ తర్వాత పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తోన్న చిత్రమిది.టీజర్ లో పవన్ ఎంట్రీనే విమానంతో పాటు వచ్చిన తీరు అభిమానులను ఆకట్టుకుంటుంది.
టీజర్ లింక్ ఇదే
https://www.youtube.com/watch?v=knaCsR6dr58