దిల్ రాజు నిర్మాతగా రామ్ కొత్త సినిమా ప్రారంభం అయింది. ఈ సినిమాను పలు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన నక్కిన త్రినాథరావు తెరకెక్కించనున్నారు. రామ్ కు జోడీగా తెలుగులో వరస పెట్టి అవకాశాలు దక్కించుకుంటున్న మెహరీన్ నటించే అవకాశం ఉందని టాక్. రామ్ తాజా చిత్రం ఉన్నది ఒక్కటే జిందగి ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేదు. ఈ సినిమాలో ప్రకాజ్ రాజ్ కీలక పాత్రలో నటించనున్నారు. ఈ సినిమా 2018 ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనుంది.