ఈ మాట అన్నది ఎవరో తెలుసా. టాలీవుడ్ లో వరస పెట్టి సినిమాల్లో దూసుకెళుతున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. తెలుగులోనే కాదు..తమిళంలో కూడా రకుల్ పలు సినిమాలు చేస్తోంది. ఓ విలేకరి మీరు కూడా నయనతారలాగా అగ్రతారగా గుర్తింపు తెచ్చుకుంటారా? అని ప్రశ్నించారు. దీనికి వెంటనే రకుల్ స్పందిస్తూ నయనతారలాంటి అగ్రతారతో తనను పోల్చవద్దని వ్యాఖ్యానించారు.
నయనతార ఓ సీనియర్ నటి అని..ఆమె ఎన్నో కష్టసాధ్యమైన పాత్రలను కూడా అలవోకగా పోషించి..ఉత్తమ నటిగా గుర్తింపు దక్కించుకున్నారన్నారు. తనకు ఇంకా అలాంటి పాత్రలు రాలేదనిత తెలిపారు. కథానాయిక ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో పోషించాలని ఉందని..ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ముందు తనలోని సామర్ధ్యాలను మెరుగుపర్చుకుని ఆ దిశగా ప్రయత్నం చేస్తానన్నారు.