ఆ నంది నాకొద్దు

Update: 2017-11-21 14:28 GMT

టెంపర్ సినిమాకు గాను నంది అవార్డు దక్కించుకున్న పోసాని కృష్ణమురళీ దీన్ని తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ప్రకటించిన నందులను రద్దు చేయకపోతే తాను జీవితాంతం కూడా వాటి మొహం చూడనని వ్యాఖ్యానించారు. నంది అవార్డు వచ్చింది కాబట్టి బతికిపోయానని..లేకపోతే తాను ఈ విమర్శలు చేసినందుకు  వైసీపీ అనో...లేక మరో కారణమో చెప్పి తనపై కూడా విమర్శల దాడి చేసేవారని పోసాని ఘాటు వ్యాఖ్యలు చేశారు.  పేపర్ లీక్ అయినప్పుడు పలు సందర్బాల్లో పరీక్షలు రద్దు చేశారని..అలాగే ఇఫ్పుడు నంది అవార్డులు రద్దు చేసి...చంద్రబాబు చెప్పినట్లు ఐవీఆర్ఎస్ ద్వారా అవార్డులు ప్రకటించాలన్నారు.

                      అప్పుడు తనకు అవార్డు రాకపోయినా పర్వాలేదన్నారు. పోసాని మంగళవారం నాడు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. ఈ అవార్డు తీసుకుంటే పోసాని కమ్మోడు కాబట్టే ఈ కమ్మ అవార్డు వాడికి ఇచ్చారు అంటారు. అందుకే ఈ అవార్డులను రద్దు చేయండి. చంద్రబాబు చెప్పినట్టుగా ఐవీఆర్ఎస్ పద్దతిలో మరోసారి విజేతలను ఎంపిక చేయండి. ’ అని కోరారు.

 

Similar News