గోపీచంద్ హీరోగా నటించన ‘ఆక్సిజన్’ గురువారం నాడు ప్రపంచ వ్యాప్తంగా గురువారం నాడు విడుదల అయింది. ఈ సినిమాలో గోపీచంద్ కు జోడీగా రాశీఖన్నా, అను ఇమ్మాన్యుయల్ నటించారు. సరైన హిట్ కోసం గోపీచంద్ ఎప్పటి నుంచో కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఆక్సిజన్ సినిమాను ఎ ఎం రత్నం ప్రెజంట్ చేయటం, ఎ ఎం జ్యోతికృష్ణ దర్శకత్వం వహించటంతో సినిమాపై సహజంగానే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. గోపీచంద్ కూడా ఈ సినిమా తనకు మంచి సక్సెస్ ఇస్తుందని గట్టి నమ్మకం వ్యక్తం చేశారు ఈ మధ్య. మరి ఆక్సిజన్ గోపీచంద్ కు భవిష్యత్ సినిమాలు వచ్చేలా ‘ఆక్సిజన్’ ఇఛ్చిందా? లేదా తెలుసుకోవాలంటే మరింత ముందుకు సాగాల్సిందే. ఇక అసలు కథలోకి వస్తే కృష్ణప్రసాద్ (గోపీచంద్) అమెరికాలో అగ్రశ్రేణి ఐటి కంపెనీలో ఉద్యోగం చేస్తుంటాడు. పెళ్లి చేసుకోవటానికి ఇండియాకు వస్తాడు. అందులో భాగంగా జగపతిబాబు ఫ్యామిలీలోకి ఎంటర్ అవుతాడు కృష్ణప్రసాద్.
జగపతిబాబు ఫ్యామిలీ కృష్ణప్రసాద్ ను ఎంతగానే అపురూపంగా చూసుకుంటుంది. పెళ్ళి చేసుకుని అమెరికా వెళ్ళటం ఏ మాత్రం ఇష్టం లేని రాశీకన్నా ఎలాగైనా పెళ్లి చెడగొట్టాలని తన మేనమామ అలీతో కలసి రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. కానీ అవేమీ వర్కవుట్ కావు. చివరకు తనను పెళ్లి చేసుకుని తమ గ్రామంలో ఉండి వ్యాపారాలు చూసుకుంటానంటేనే అందుకు ఓకే చెబుతానంటుంది. దానికి కృష్ణప్రసాద్ సరేనంటాడు. వాస్తవానికి కృష్ణప్రసాద్ అసలు పేరు సంజీవ్. ఆర్మీఆఫీసర్. ఆర్మీఆఫీసర్ ఐటి ఇంజనీర్ గా ఎందుకు జగపతిబాబు ఇంట్లోకి ప్రవేశించాడు..రాశీఖన్నాతో పెళ్లి జరిగిందా? లేదా అన్నది వెండితెరపై చూడాల్సిందే. ఇంటర్వెల్ సమయంలో వచ్చే ట్విస్ట్ ఆసక్తికరంగా ఉంటుంది. ఈ తరహా రివెంజ్ స్టోరీలు గతంలో వచ్చినా సస్పెన్స్ ను కొనసాగించటంలో దర్శకుడు సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు.
క్ల్లైమాక్స్ లో జగపతిబాబు క్యారెక్టర్ ఎంట్రీ కూడా సినిమాలో హైలెట్ గా ఉంటుంది. ఈ సినిమాలో వెన్నెల కిషోర్ రోల్ చాలా చిన్నదే అయినా..ఉన్నంతలో కాసేపు నవ్విస్తాడు. అలీ క్యారెక్టర్ కూడా అలాంటిదే. ఈ సినిమాలో ఉన్న మరో హీరోయిన్ అను ఇమ్మాన్యుయల్ పాత్ర నిడివి చాలా తక్కువే. చాలా చోట్ల డైలాగులు ప్రేక్షకులను మెప్పిస్తాయి. నటన పరంగా చూస్తే గోపీచంద్ ఫుల్ ఎనర్జిటిక్ గా కన్పించాడు. ఓ రకమైన మత్తు పదార్ధాలతో తయారు చేసే సిగరెట్ల వల్ల యువత వీటికి ఎలా బానిసలు అవుతున్నారనే విషయాన్ని ఈ సినిమా ద్వారా బాగా చూపించారు. ఓవరాల్ గా చూస్తే ఆక్సిజన్ సో...సో సినిమాగానే మిగిలిపోయింది.
రేటింగ్. 2.25/5