నాని కొత్త సినిమా మిడిల్ క్లాస్ అబ్బాయ్ (ఎంసీఏ) టీజర్ విడుదలైంది. ఇందులో ఓ వింత ఉంది. తెలుగు సినిమాలతోపాటు ఏ సినిమాలో అయినా రొటీన్ లవ్ స్టోరీ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం వెరైటీ ఉంటుంది. అది ఏంటి అంటే ఇందులో హీరోయిన్ గా చేస్తున్న సాయిపల్లవి ఓ చోట నిలుచుని ఫోన్ మాట్లాడుతున్న నానికి పువ్వు ఇచ్చి..నువ్వు నాకు ఇచ్చావ్ ..పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం అంటూ ప్రపొజ్ చేస్తుంది. ఈ దెబ్బకు నాని ఫోన్ కిందపడపోతుంటే అది కూడా సాయిపల్లవే అందుకుని నానికి ఇచ్చేసి వెళ్ళిపోతుంది.
అంతే నాని షాక్ లో అలా చూస్తూ ఉండిపోతాడు. ఈ వెరైటీ చాలదా యూత్ కు కిక్కెక్కించటానికి. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా డిసెంబర్ లో విడుదల కానుంది. వేణూ శ్రీరామ్ చిత్ర దర్శకుడు. టీజర్ లో నాని...సాయి పల్లవి చాలా ఫ్రెష్ లుక్ తో కన్పిస్తూ యూత్ ను ఆకట్టుకునేలా ఉన్నారు. ఎంసీఏ అంటే అంటీ అని మిత్రుడు అడిగిన ప్రశ్నకు నాని సమాధానం కూడా ఈ టీజర్ లో చూడొచ్చు. ఈ మధ్య కాలంలో నాని చేసిన సినిమాలు అన్నీ హిట్లే. ఎంసీఏ టీజర్ హింట్ ఇచ్చేసింది అప్పుడే. ఆగాలి మరి డిసెంబర్ వరకూ అసలు విషయం తెలియాలంటే.
టీజర్ లింక్ ఇదే
https://www.youtube.com/watch?time_continue=1&v=il_pSa5l98w