నాగ్...వర్మ..టబు..సూపర్ కాంబినేషన్

Update: 2017-11-01 15:42 GMT

నాగార్జున..రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ లో సినిమా ప్రారంభం అయ్యేందుకు ముహుర్తం ఖరారైంది. నవంబర్ 20 నుంచే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘శివ’ సినిమా టాలీవుడ్ లో పెద్ద సంచలనం..రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. ఎంతో గ్యాప్ తర్వాత రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగ్ యాక్ట్ చేయనున్నారు. వర్మ తనకు చెప్పిన కథ నచ్చటంతో వెంటనే దీనికి అంగీకరించినట్లు తెలిపారు. నాగ్ తో తీసిన శివ సినిమాకి కొబ్బరికాయ కొట్టిన అన్నపూర్ణ స్టూడియోలోనే ఈ కొత్త సినిమాను ప్రారంభించనున్నట్లు  వర్మ  తెలిపారు. 

                            నవంబర్ 20న ఈ సినిమాను హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభించనున్నట్లు తెలిపారు.  వర్మ తాజా ట్వీట్‌తో ఈ మూవీకి ‘శివ-2’  టైటిల్‌ ఖాయమని ప్రచారం జరుగుతోంది. నాగార్జున సరసన ఈ సినిమాలో టబు హీరోయిన్ గా నటించనున్నారనేది టాలీవుడ్‌  టాక్. ఈ మూవీలో నాగ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడట. అయితే  మూవీ టైటిల్‌, రిలీజ్‌ డేట్‌, నటీ నటులు లాంటి  పూర్తి  వివరాలు తెలియాలంటే ఈ నెల 20 వరకు  సస్పెన్స్‌ తప్పదని అంటున్నారు.

 

 

Similar News