బాలకృష్ణ దూకుడు ఏ మాత్రం తగ్గలేదు. వంద చిత్రాలు పూర్తయిన వరస పెట్టి సినిమాలు చేస్తూ దూసుకెళుతున్నాడు. ఇటీవలే ‘పైసా వసూల్’ విడుదల అయిన సంగతి తెలిసిందే. మళ్ళీ ‘జై సింహ’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. తనకు కలిసొచ్చిన సంక్రాంతికి ఈ సినిమాతో ముందుకు వచ్చేందుకు బాలకృష్ణ సిద్ధం అవుతున్నాడు. అందులో భాగంగా వరస పెట్టి కార్యక్రమాలు ఖరారు చేస్తున్నారు. జైసింహ సినిమాను తమిళ దర్శకుడు కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాను సి కళ్యాణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. బాలయ్య సరసన నయనతార, నటాషా జోషి, హరిప్రియలు హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న జై సింహా సినిమా ఆడియోను డిసెంబర్ 23న విజయవాడలో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాతో ఆకట్టుకున్న సంగీత దర్శకుడు చిరంతన్ భట్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. జై సింహా షూటింగ్ పూర్తయిన వెంటనే తేజ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ ను ప్రారంభించనున్నారు బాలకృష్ణ. ఈ సినిమా ఇప్పుడు పెద్ద సంచలనంగా మారనుంది. ఈ సినిమాలో ఎలాంటి అంశాలు ఉంటాయనే అంశం అందరిలో ఆసక్తి రేపుతోంది.