ఇద్దరూ హీరోలే. కాకపోతే ఒకరు సూపర్ సీనియర్..మరొకరు జూనియర్ . వాళ్లిద్దరే చిరంజీవి, రామ్ చరణ్. ఇద్దరూ ఒకే లుక్ లో కన్పించేసరికి వాళ్ళ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ ఫోటోను కూడా సోషల్ మీడియాలో విరివిగా షేర్ చేస్తున్నారు. రామ్ చరణ్ ఇఫ్పటికే రంగస్థలం సినిమాను పూర్తి చేసుకుని..తానే నిర్మాతగా వ్యవహరించనున్న సైరా సినిమా కోసం రెడీ అవుతున్నాడు. చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమా ఇచ్చిన కిక్ తో కొత్త సినిమా సైరా సినిమాకు సై అంటున్నాడు.
ఇద్దరూ ఎవరి బిజీలో వారున్నారు. ఈ బిజీ టైమ్ లోనూ చిరును ఒప్పించి చరణ్ కాఫీకి తీసుకొచ్చాడట. మీరు చూస్తున్న ఫోటో కూడా అదే. ‘‘నేను, నాన్న సేమ్ టు సేమ్. ఇద్దరం గడ్డం లుక్ లోనే, ఇది మాకు కాఫీ టైమ్. నాన్నగారితో ఆనందంగా ఇలా బయటికి వచ్చి కాఫీ త్రాగడం కోసం ఒప్పించాను..’’ అంటూ చెర్రీ ఈ ఫొటోని పోస్ట్ చేశాడు. ఈ ఫోటోపై రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా కామెంట్ చేశారు.