బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ఫుల్ హ్యాపీ. దీనికి బలమైన కారణమే ఉంది. సంపూర్ణేష్ బాబు కు తెలంగాణ సీఎం కెసీఆర్ అంటే చాలా ఇష్టం. ఎప్పటినుంచే ఆయన్ను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు సోమవారం నాడు సక్సెస్ అయ్యాయి. అంతే సంపూర్ణేష్ బాబు ఫుల్ కుషీగా ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నారు. ఇన్నేళ్లకి నా కల నెరవేరిందంటున్నాడు. సంపూర్ణేష్ బాబు ట్వీట్ ఇలా ఉంది.
'తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, నా అభిమాన నాయకుడు, మా కేసీఆర్ ని కలవటం నా కల...ఆ కల ఇన్నేళ్ళకి సాకారం అయింది. మంత్రి కేటీఆర్ ని కూడా కలిశాను. సదా వారి ప్రేమకి నేను బానిసను' అని పేర్కొన్నారు. కేసీఆర్‌ను కలిసిన సందర్భంగా ఆయనతో కలిసి దిగిన ఫొటోలను ట్వీట్టర్‌లో తన ఫాలోయర్లతో షేర్ చేసుకున్నాడు.